గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

భారత్ న్యూస్ అమరావతి..గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం
• అప్పుడు కృష్ణా డెల్టాకు నీటి సమస్య రాదు. గతంలో ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేస్తే గత పాలకుడు గోదాట్లో కలిపేశాడు
• రూ.440 కోట్లతో కట్టిన డయాఫ్రామ్ వాల్ ను ముంచేశాడు. ఇప్పుడు మళ్లీ కేంద్ర సహకారంతో రూ.1000 కోట్లతో చేపట్టి పూర్తి చేశాం.
• కొందరు నిర్మించిన వాటిని మరికొందరు కూలుస్తుంటారు. మళ్లీ వాటి పునర్నిర్మాణం చేయటం జరుగుుతంది.
• పోలవరం, అమరావతి రాజధానిని మళ్లీ పునర్నిర్మించే అవకాశం నాకు వచ్చింది.
• రూ.4,660 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై వేయకుండా విద్యుత్ ఛార్జీలను ట్రూ డౌన్ చేశాం
• భవిష్యత్తులోనూ కరెంటు చార్జీలను పెంచేది లేదు.
• గత పాలకులు 9 సార్లు కరెంటు ఛార్జీలు వేసి రూ.32 వేల కోట్లు ప్రజలపై భారం వేశారు
• సోలార్ రూఫ్ టాప్‌తో ప్రోజ్యూమర్ అనే విధానాన్ని తీసుకువస్తున్నాం
• సామాన్యులకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం
• గంజాయి రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు
• హాస్టళ్లు, బియ్యం పంపిణీ, ధాన్యం కొనుగోలు మధ్యాహ్న భోజనం తదితర అంశాల్లో మెరుగు పడాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి
• ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రావడానికి వీల్లేదు
• ఉచిత ఇసుక ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకున్నాం.
• రూ.వెయ్యి కోట్ల ఆదాయం కోల్పోతున్నా ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తున్నాం
• పౌరసేవలు మెరుగ్గా అందించాల్సిందే. ఇందులో ఎలాంటి రాజీ లేదు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే నేను నిరంతరం ఆలోచన చేస్తాను.
• మారీచుడి కంటే ఎక్కువ వేషాలు రాష్ట్రంలోని ఓ పార్టీ వేస్తోంది.

-సూరేపల్లి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు