కృష్ణాష్టమి ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి ఐదుగురి మృతి…

..భారత్ న్యూస్ హైదరాబాద్…కృష్ణాష్టమి ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి ఐదుగురి మృతి…

తెలంగాణ : హైదరాబాద్‌‌లో తీవ్ర విషాదం నెలకొంది. గోకులేనగర్‌లో ఆదివారం రాత్రి శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా రథాన్ని ఊరేగించారు. రథానికి విద్యుత్‌ తీగలు తగిలి ఐదుగురు మృతిచెందారు. రథాన్ని లాగుతున్న 9 మందికి షాక్‌ కొట్టడంతో వారంతా ఎగిరి దూరంగా పడిపోయారు. వారిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఐదుగురు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మరో నలుగురు చికిత్స పొందుతున్నారు….