క్యాన్సర్కు ట్రీట్మెంట్.. HIVని గెలిచిన వృద్ధుడు!

భారత్ న్యూస్ ఢిల్లీ…..క్యాన్సర్కు ట్రీట్మెంట్.. HIVని గెలిచిన వృద్ధుడు!

జర్మనీకి చెందిన 61 ఏళ్ల వ్యక్తి రికార్డు సృష్టించారు.

ప్రపంచంలో ఇప్పటి వరకూ HIV నుంచి పూర్తిగా కోలుకున్న ఏడవ వ్యక్తిగా గుర్తింపు పొందారు.

బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా జరిగిన కీమోథెరపీ.. పాత ఇమ్యూన్ సెల్స్తో పాటు HIV కణాలను కూడా నాశనం చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

HIV రెసిస్టెంట్ స్టెమ్ సెల్స్ లేకుండానే కోలుకున్న రెండో వ్యక్తిగానూ ఇతను నిలిచారు. ప్రస్తుతం అతను పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.