రైతు వ్యవసాయ సర్వీసుల మంజూరు వేగవంతం చేయాలి

భారత్ న్యూస్ హైదరాబాద్…హన్మకొండ:

రైతు వ్యవసాయ సర్వీసుల మంజూరు వేగవంతం చేయాలి

హన్మకొండలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి 16 సర్కిళ్ల ఎన్పీడీసీఎల్ ఇంజినీర్ లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.

సింగిల్ విండో పాలసీలో భాగంగా టీజీ ఐపాస్, నాన్ టీజీ ఐపాస్ సర్వీసుల మంజూరు కాలపరిమితికి లోబడి త్వరితగతిన రిలీజ్ చేయాలని ఆదేశించారు.

విద్యుత్ అధికారులు పొలం బాట కార్యక్రమం చేపట్టి అందులో రైతులకు విద్యుత్ ప్రమాదాల పట్ల అవగాహన కల్పించాలని ఆదేశించారు..