మంటల్లో ముగ్గురు సజీవ దహనం,

..భారత్ న్యూస్ హైదరాబాద్….మంటల్లో ముగ్గురు సజీవ దహనం

మహబూబాబాద్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరిపెడ శివారు ఎల్లంపేట స్టేజ్ సమీపంలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్ సజీవ దహనం అయ్యారు.

ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పి, ట్రాఫిక్ క్లియర్ చేయించారు.

మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.