మీరు చేసే ఉద్యోగం ఏదైనా సరే రోజులో ఎన్ని గంటల పాటు కూర్చుని పనిచేస్తున్నారో చెక్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఎయిమ్స్ శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించిన విషయాలు ఆందోళనకరంగా ఉన్నాయి. రోజంతా కూర్చుని పనిచేసే వారిలో భారతీయులే ఎక్కువగా ఉంటున్నారని.. దీంతో ప్రాణాలు పోయే వ్యాధి బారిన పడుతున్నారని తేలింది.

భారతదేశంలో, ముఖ్యంగా యువతలో గుండె జబ్బులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నుంచి ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ అంబుజ్ రాయ్, డాక్టర్ నితీష్ నాయక్ ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం అత్యవసర సూచనలు జారీ చేశారు. రెగ్యులర్ వ్యాయామం, సమతుల ఆహారం, నిత్యం ఆరోగ్య పరీక్షలు గుండెను కాపాడుకోవడానికి కీలకమని వారు నొక్కి చెప్పారు. భారతదేశం ప్రపంచంలో కరోనరీ హార్ట్ డిసీజ్ రాజధానిగా మారుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.