మావోయిస్టు మరో అగ్రనాయకురాలు గీత లొంగుబాటు

భారత్ న్యూస్ ఢిల్లీ…..మావోయిస్టు మరో అగ్రనాయకురాలు గీత లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రూ. 5 లక్షల రివార్డు కలిగిన టాప్ మహిళా మావోయిస్ట్ కమాండర్ గీత అలియాస్ కమ్లి సలామ్ కొండగావ్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయింది. ప్రభుత్వ ‘నక్సలిజం నిర్మూలన విధానం’ మరియు పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి కారణంగానే ఆమె లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు. తూర్పు బస్తర్ ప్రాంతంలో ‘టైలర్ టీమ్’ నాయకురాలిగా పనిచేసిన గీత, పలు హింసాత్మక ఘటనల్లో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం…