విశ్వ వేదికలపై తెలంగాణ తరుపున మాట్లాడటమే గొప్ప గౌరవం..

.భారత్ న్యూస్ హైదరాబాద్….విశ్వ వేదికలపై తెలంగాణ తరుపున మాట్లాడటమే గొప్ప గౌరవం.. కానీ ఆ గౌరవానికి తగిన జాగ్రత్త, సమర్ధత, భాధ్యత అవసరం. అది మాటల ప్రయోగం మాత్రమే కాదు – అది మన రాష్ట్ర ప్రతిష్టను మోసుకెళ్లే ఒక అరుదైన అవకాశం. చిన్న తప్పు కూడా తెలంగాణ పై తప్పుడు అభిప్రాయం కలగజేయవచ్చు.
పెద్ద పెద్ద నాయకులు తమ భాషలో మాట్లాడి పక్కవారికి అర్థం కావడానికి అనువాదకులను పెట్టుకుంటారు. మనకు రానప్పుడు ఊరుకోవాలి లేదా వేరొకరికి అప్పజెప్పాలి. ఇలా విశ్వ వేదికలపై తెలంగాణ తరుపున మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి …?
తెలంగాణకు ప్రతినిధిగా మాట్లాడేటప్పుడు ఎంత భాద్యతతో ఉండాలి ? తెలంగాణ ప్రజానీకం తరఫున ఒక బాధ్యతగా ఉండాల్సిన వారు
మన ప్రాంత అభివృద్ధి మన ఆత్మగౌరవం హోదా ప్రతిబింబించే విధంగా ఉండాలి. మరి ఎందుకో
మంత్రి కొండ సురేఖ రాని భాషను పట్టుకొని దానిని సాగదీసి మాట్లాడే ప్రయత్నం చేసి నవ్వుల పాలయ్యారు. ఇలాంటివి సరికాదని తెలంగాణ ప్రజానీకం సూచిస్తుంది. ఇప్పటికే పీకల్లోతూ వివాదాల్లోకి కూరుకుపోయిన మంత్రి కొండ సురేఖ ఇలాంటి చిన్నచిన్న తప్పిదాలు కూడా మొత్తం ప్రపంచం చూసే విధంగా నవ్వుల పాలు కావడం కూడా తెలంగాణ ప్రజలు జన్మించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రభుత్వం నవ్వుల పాలయ్యే అవకాశాలు నిండుగా ఉంటాయి…..