నువ్వు పెట్టే చికెన్ కూర, చేపల ఫ్రై తినడానికి, సొల్లు చెప్పడానికి రాలేదు.. ప్రజలకు మంచి చేస్తామని చెప్పడానికి వస్తే తొందరగా ముగించమంటారా

.భారత్ న్యూస్ హైదరాబాద్….నువ్వు పెట్టే చికెన్ కూర, చేపల ఫ్రై తినడానికి, సొల్లు చెప్పడానికి రాలేదు.. ప్రజలకు మంచి చేస్తామని చెప్పడానికి వస్తే తొందరగా ముగించమంటారా

మంత్రి జూపల్లి కృష్ణారావుపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆగ్రహం

కొల్లాపూర్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బహిరంగ సభలో మల్లు రవి మాట్లాడుతుండగా స్పీచ్ తొందరగా ముగించాలి అని రాసిన చీటీని తీసుకొచ్చి ఇచ్చిన కాంగ్రెస్ నాయకుడు

నేను సొల్లు చెప్పడానికి రాలేదు.. ప్రజలకు మంచి చేస్తామని చెప్పడానికి వస్తే తొందరగా ముగించమంటారా అని అసహనం వ్యక్తం చేసిన మల్లు రవి

జూపల్లి కృష్ణారావు పెట్టే చికెన్ కూర, చేపల ఫ్రై తినడానికి రాలేదు.. ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చాను

నేను మాట్లాడుతుంటే ఆపమంటారా అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావుపై మండిపడ్డ ఎంపీ మల్లు రవి …