భారత్ న్యూస్ హైదరాబాద్….రైలు ఎక్కబోయి జారి పడి.. యువకుడు మృతి
Jun 07, 2025,
రైలు ఎక్కబోయి జారి పడి.. యువకుడు మృతి
తెలంగాణ : హనీమూన్‌కు బయలుదేరిన నవ దంపతుల ప్రయాణం విషాదంగా ముగిసింది. వరంగల్‌కు చెందిన ఉరగొండ సాయి(28)కి 3 నెలల క్రితం వివాహమైంది. హనీమూన్‌కు గోవా వెళ్లడం కోసం శుక్రవారం ఉదయం భార్య, బావమరిది, స్నేహితులతో కలిసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కారు. వాటర్ బాటిల్ కొనేందుకు సాయి వెళ్లగా రైలు బయలుదేరడంతో స్నేహితులు చైన్ లాగారు. దీంతో ఆర్పీఎఫ్ పోలీసులు ప్రశ్నించగా సాయి ఫైన్ చెల్లిస్తామని.. వదిలిపెట్టమని కోరుతుండగా రైలు బయలుదేరింది. దీంతో అతడు రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా కాలు జారి రైలు, ప్లాట్‌ఫాం మధ్య పడిపోయి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ చనిపోయాడు.
