రామాంజనేయ పురం తండాను గ్రామ పంచాయతీగా గుర్తించాలని గ్రామ ప్రజల డిమాండ్

భారత్ న్యూస్ ఖమ్మం…రామాంజనేయ పురం తండాను గ్రామ పంచాయతీగా గుర్తించాలని గ్రామ ప్రజల డిమాండ్
రామాంజనేయ పురం తండాలో 500 కుటుంబాలు నివసిస్తున్న కానీ ఇప్పటికీ ప్రత్యేక గ్రామపంచాయతీ గా గుర్తించని రాష్ట్ర ప్రభుత్వం తండాలో కనీస అవసరాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి పట్టింపు లేదని తండావాసులు ఆవేదన చెందుతున్నారు దీనిపై ఇప్పటికైనా సంబంధిత అధికారులు గానీ స్థానిక ఎమ్మెల్యే గాని ఈ రామాంజనేయ పురం తండాను గ్రామ పంచాయతీగా గుర్తించి ప్రజల అవసరాలను తీర్చాలని తండావాసులు కోరుతున్నారు