వందే భారత్ రైళ్ల టైమింగ్స్ సవరించిన దక్షిణ మధ్య రైల్వే

..భారత్ న్యూస్ హైదరాబాద్….వందే భారత్ రైళ్ల టైమింగ్స్ సవరించిన దక్షిణ మధ్య రైల్వే

కాచిగూడ–యశ్వంత్‌పూర్ మరియు కలబురిగి–బెంగళూరు మధ్య నడిచే నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు దక్షిణ మధ్య రైల్వే కొత్త టైమింగ్స్ ప్రకటించింది.

హిందూపూర్, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, యెలహంక స్టేషన్ల వద్ద రైళ్ల ఆగే సమయాల్లో మార్పులు చేశారు.

ఈ సవరించిన టైమింగ్స్ మార్చి 15, 2026 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.