NH 65 జాతీయ రహదారి వద్ద అండర్పాస్ బ్రిడ్జి నిర్మించేందుకు,చొరవ చూపాలని,ఉత్తమ్ పద్మావతి రెడ్డి

…భారత్ న్యూస్ హైదరాబాద్….కోదాడ నుండి చిలుకూరు మండలం రామాపురం గ్రామం వెళ్లే NH 65 జాతీయ రహదారి వద్ద అండర్పాస్ బ్రిడ్జి నిర్మించేందుకు జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి చొరవ చూపాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్
కోదాడ నుండి చిలుకూరు మండలం రామాపురం గ్రామం వెళ్లే NH 65 జాతీయ రహదారి వద్ద వెంటనే అండర్పాస్ బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు ఈ మేరకు శుక్రవారం చిలుకూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి కోదాడలోని NH 65 జాతీయ రహదారి వద్ద నిరసన తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ NH 65 జాతీయ రహదారి నిర్మాణం జరిగిన నాటి నుంచి చిలుకూరు మండలంలోని రామాపురం పాత కొండాపురం కొత్త కొండాపురం ఆర్లగూడెం పలు గ్రామాల ప్రజలు నిత్యం ఈ రోడ్డుపై ప్రయాణం చేస్తుండడంతో ఇక్కడ అండర్పాస్ బ్రిడ్జి నిర్మించాలని పలుమార్లు ప్రజాప్రతిధులకు సంబంధిత అధికారులకు వేడుకున్న ఇక్కడ అండర్పాస్ నిర్మించకపోవడంతో అనేకమంది ప్రజలు ఇప్పటికే ప్రాణాలు కోల్పోగా నిత్యం ఈ రోడ్డుపై ప్రయాణం చేస్తున్న గ్రామాల ప్రజలతోపాటు రామాపురం గ్రామంలో నిర్మించి ఉన్న ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు చదువు కోసం పలు ప్రాంతాల నుంచి నిత్యం తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని ప్రయాణం సాగించవలసిన పరిస్థితి దాపరించింది కావున ఇట్టి అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం గౌరవ కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు గౌరవ జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గార్లు మరియు రాష్ట్ర రోడ్డు భవన నిర్మాణంలో శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెంటనే స్పందించి కేంద్ర రోడ్డు భవన నిర్మాణాల శాఖ మంత్రితో సంప్రదించి వెంటనే అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేయాలని లేకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం తమ సంఘం ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో చిలుకూరు మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు ఆయా గ్రామాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు…