తెలంగాణ :
భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ప్రభుత్వానికి ‘ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత’ ప్రతిపాదనలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ సవరణకు చర్యలు చేపట్టింది.
ఈ నిబంధనను సవరించాలని కోరుతూ ప్రభుత్వానికి పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు పంపింది.
ప్రభుత్వ ఆమోదం అనంతరం కొత్త సవరణలతో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశముంది.
