భారత్ న్యూస్ హైదరాబాద్….టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు నిలిపివేత.. నేటి నుంచే అమలు
దేశవ్యాప్తంగా నేటి (శుక్రవారం) నుంచి జాతీయ రహదారులపై టోల్ చెల్లింపుల్లో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి.
టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను NHAI పూర్తిగా నిలిపివేసింది. ఇకపై వాహనదారులు కచ్చితంగా FASTag లేదా UPI ద్వారానే టోల్ చెల్లించాల్సి ఉంటుంది.

ఈ మార్పుతో పాటు టోల్ ఛార్జీలు సగటున 10% వరకు పెరిగాయి. ఎక్స్‌ప్రెస్‌వేల్లో 1.5% నుంచి 3.5% వరకు పెంపు జరిగింది. వార్షిక టోల్ పాస్ ధరను రూ.3,075గా నిర్ణయించారు. వాహనదారులు ఇది గమనించాలి.