నిన్న నర్సీపట్నం వేదిక ఫంక్షన్‌ హాల్లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

.భారత్ న్యూస్ హైదరాబాద్….నిన్న నర్సీపట్నం వేదిక ఫంక్షన్‌ హాల్లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలైన శ్రీ గోపీనాథ్ గారు గారి అభినందన సత్కార సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన శ్రీ గోపీనాథ్ గారు మరియు శ్రీమతి పి.వి.ఎం. నాగజ్యోతి గారికి గాదె శ్రీనివాసులు నాయుడు గారి చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది.

ఈ వేడుకకు నర్సీపట్నం డివిజన్‌లోని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరై వారిని ఘనంగా అభినందించారు.

పి.ఆర్.టి.యు జిల్లా మహిళా కార్యదర్శిగా శ్రీమతి పి.వి.ఎం. నాగజ్యోతి గారు, శ్రీ గోపీనాథ్ గారు నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ తన వంతు సహకారం అందిస్తున్నారు.

ఈ ఏడాది ఒకేసారి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎస్‌.జి.టి. కేటగిరీలో శ్రీ గోపీనాథ్ గారికి, స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీలో శ్రీమతి పి.వి.ఎం. నాగజ్యోతి గారికి రావడం గర్వకారణమని పలువురు ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయిని శ్రీమతి పి.వి.ఎం. నాగజ్యోతి గారు ప్రసంగిస్తూ –
తాను ఇప్పటివరకు సాధించిన విజయాలను క్లుప్తంగా వివరించారు. ఆంగ్లభాష అభివృద్ధికి చేసిన కృషిని, NCERT, SCERT నిర్వహించిన వివిధ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణలు అందించిన తీరు, FLN, NISHTHA ప్రోగ్రామ్స్‌లో కీ రిసోర్స్ పర్సన్‌గా అందించిన సేవలను వివరించారు.

అలాగే తాను RISE – బెంగళూరు వారు నిర్వహించిన 30 రోజుల సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ పూర్తి చేసిన విషయాన్ని, దానిలో నేర్చుకున్న విషయాలను తిరిగి పాఠశాలల్లో అమలు చేస్తున్న విధానాన్ని, అలాగే ఫోనెటిక్స్‌ లాంగ్వేజ్‌ బోధనలో ఇస్తున్న శిక్షణల వివరాలను కూడా తెలియజేశారు.