భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తెలంగాణలో భారీగా పక్కదారి పడుతున్న సన్న బియ్యం
ధాన్యం కొనుగోళ్లలోనూ నకిలీ రైతుల పేర్లతో కోట్ల విలువ చేసే ధాన్యం పక్కదారి
రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇస్తున్న సన్న బియ్యం, గోదుమలు, ఇతర సరుకులను వారి దగ్గర తక్కువ ధరకు కొని, బయట ఎక్కువ ధరకు అమ్ముకుంటున్న దళారులు
ధాన్యం కొనుగోళ్ల వద్ద కూడా నకిలీ రైతుల పేర్లను సృష్టించి, వేల క్వింటాళ్ల ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న రైస్ మిల్లర్లు, గోదాముల యజమానులు
కేవలం హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మండలంలోనే 8049.6 క్వింటాళ్ల అక్రమ ధాన్యాన్ని గుర్తించిన విజిలెన్స్ అధికారులు
రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్లు, గోదాముల యజమానులు, దళారులు అందరూ కలిసి ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల నష్టం కలిగిస్తున్నారని విజిలెన్స్ అధికారుల నివేదిక

ఎన్ని సార్లు చెప్పినా ప్రభుత్వం అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, నామమాత్రంగా తనిఖీ చేసి వెళ్లిపోతున్నారని వాపోతున్న ఫిర్యాదుదారులు…