ఈడుపుగల్లు నారాయణ స్కూల్ విద్యార్థుల చే రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం….

భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణా జిల్లా, పెనమలూరు..

ఈడుపుగల్లు నారాయణ స్కూల్ విద్యార్థుల చే రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం….

రోడ్డు భద్రత పై అవగాహన పెంచేందుకు , ఒక వినూత్న కార్యక్రమం నిర్వహించబడింది. స్కూల్ విద్యార్థులు గులాబీ పువ్వులతో ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టి, హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, హెల్మెట్ ధరించిన వాహనదారులకు విద్యార్థులు గులాబీ పువ్వులు అందజేస్తూ అభినందించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి కూడా ప్రేమతో పువ్వు ఇచ్చి, రోడ్డు భద్రత నియమాలను పాటించాలనే సందేశాన్ని చేరవేశారు.

“మీ జీవితం మీ కుటుంబానికి అమూల్యం… కాబట్టి హెల్మెట్ తప్పనిసరి” అనే నినాదాలతో విద్యార్థులు ప్రజలను చైతన్యపరిచారు.

ఈ అవగాహన కార్యక్రమానికి స్థానిక ట్రాఫిక్ పోలీసుల సహకారం కూడా లభించింది. వారు హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు ఎలా రక్షించబడతాయో వివరించారు….