భారత్ న్యూస్ ఢిల్లీ…..17 నుంచి రాష్ట్రపతి శీతాకాల విడిది
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దక్షిణాది శీతాకాల విడిది ఖరారైంది.
ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె విడిది చేయనున్నారు.
19న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.
20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో గ్లోబల్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు.
21న వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం అవుతారు. అనంతరం నిర్వహించే తేనీటి విందులో పాల్గొంటారు.

22న ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.