మాకు మంత్రి పదవి ఇవ్వండి సార్ ప్లీజ్

..భారత్ న్యూస్ హైదరాబాద్….మాకు మంత్రి పదవి ఇవ్వండి సార్ ప్లీజ్

మల్లికార్జున్ ఖర్గేకి పోటాపోటీ నివేదికలు అందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

ఖర్గేను కలిసి తమ అభ్యర్థనలు వినిపించిన ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, బాలు నాయక్, రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి

అత్యధిక జనాభా ఉన్న హైదరాబాద్–రంగారెడ్డి జిల్లాలో మంత్రి లేకపోవడం ఇదే మొదటిసారని తెలిపిన మల్‌రెడ్డి రంగారెడ్డి

బంజారాల్లో 80% మంది కాంగ్రెస్ కి మద్దతుగా నిలిచారని, అయినా తనకు మంత్రి పదవి ఇవ్వలేదని బాలు నాయక్

రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో మంత్రి పదవి లేనిది తానొక్కడికే అని తెలిపిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

పార్టీ సీనియర్‌గా తనకు అవకాశం ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి నివేదికలు అందజేయగా, ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వకుండా అందరి అభ్యర్థనలను విన్న మల్లికార్జున్ ఖర్గే. …