భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…
📍మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డికి మరో షాక్.. అసైన్డ్ భూముల్లో ఫామ్‌హౌస్!
తెలంగాణ :
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా రోహిత్ రెడ్డి మరో షాక్ తగిలింది.
ఈ ఫామ్‌హౌస్‌ను అసైన్డ్ భూముల్లో నిర్మించారంటూ ఆరోపణలు రావడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు.
దీనిపై ఇప్పటికే పోలీసుల నుంచి ఫిర్యాదు రాగా రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. ఈ ఫామ్‌హౌస్‌ను అసైన్డ్ భూముల్లో నిర్మించినట్లు అధికారులు గుర్తించారు.

దీనికి సంబంధించిన రిపోర్టును ఉన్నతాధికారులకు అందజేయనున్నారు.