క్రీడలలో ఒకరు విజేతగా గెలిస్తే, మరొకరు పరాజితులవుతారు.

భారత్ న్యూస్ నెల్లూరు…క్రీడలలో ఒకరు విజేతగా గెలిస్తే, మరొకరు పరాజితులవుతారు. ఓడినంత మాత్రాన వారేమీ చేతగానివారేమి కాదు..మరోసారి విన్నర్ అయ్యేందుకు పట్టుదలతో కృషి చేయాలనే సందేశం పొందాలి..అదే స్పోర్ట్స్ మెన్ షిప్.. మన దేశ మహిళా క్రికెట్ జట్టులో గత రాత్రి ఫైనల్ మ్యాచ్ లో ఆ గొప్ప లక్షణం ఎంతో స్పష్టంగా కనబడింది..

మరి మన దేశ పురుషుల క్రికెట్ ఆటలో ఇటీవల క్రీడా స్ఫూర్తి బొత్తిగా కొరవడింది.. క్రికెట్ ఆటను చిన్న సైజు యుద్ధాలుగా మారుస్తున్నారు. విజేతలు పరాజితులకు కనీసం ఒక చిరునవ్వు ..షేక్ హ్యాండ్.. హాగ్…వంటి స్నేహపూర్వక చర్యలు ఎక్కడా కనబడటం లేదు.. ఒకరినొకరు గుడ్లు ఉరిమి చూసుకోవడాలు. పళ్ళు పట పట కొరుక్కోవడం..ఉమ్ములు నేలపై ఊయడం..చిన్న విషయాలకే తగాదాలు గిల్లికజ్జాలు పెట్టుకొంటున్నారు.. క్రీడా స్ఫూర్తి ఆటగాళ్లలో కొరవడినపుడు ఆటల అంతరార్థంకు పరమార్ధమే లేదు..అందుకే స్పోర్ట్స్ విమేన్ షిప్ గా ఆ పదాన్ని మార్చాలి.. !! — JJJ.