రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి జూబ్లీహిల్స్ నివాసంలో సందడి నెలకొంది

..భారత్ న్యూస్ హైదరాబాద్….రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి జూబ్లీహిల్స్ నివాసంలో సందడి నెలకొంది. మహిళా మంత్రులు, ఇతర ప్రతినిధులు పెద్దఎత్తున తరలిరావడంతో రాఖీ పండుగ కోలాహళంగా సాగింది. మంత్రులు కొండా సురేఖ గారు, ధనసరి అనసూయ సీతక్క గారు ముఖ్యమంత్రి గారికి రాఖీ కట్టారు. మాజీ మంత్రి డాక్టర్ గీతా రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి రాఖీ కట్టి ఆశీర్వదించారు. వీరితో పాటు మరెందరో సోదరీమణులు రాఖీ కట్టారు.

ఈ వేడుకలో పాల్గొన్న బ్రహ్మకుమారీస్ (Brahma Kumaris) సోదరీమణులు ముఖ్యమంత్రి గారిని కలిసి రాఖీ కట్టారు. మలక్ పేట ప్రభుత్వ అంధ బాలికల పాఠశాల విద్యార్థినులు ముఖ్యమంత్రి గారిని కలిసి ఆప్యాయంగా రాఖీ కట్టారు.

అలాగే, మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద గారు, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత గారు, బీసీ కమిషన్, విద్యా కమిషన్, శిశు సంక్షేమాభివృద్ధి కమిషన్, రైతు కమిషన్ కు చెందిన మహిళా ప్రతినిధులు, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు గారితో పాటు మహిళా ప్రతినిధులు రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టారు.