మిస్ ఇంగ్లాండ్ ఆరోపణల్లో నిజం లేదు: మిస్ వరల్డ్ నిర్వాహకులు….

…భారత్ న్యూస్ హైదరాబాద్….మిస్ ఇంగ్లాండ్ ఆరోపణల్లో నిజం లేదు: మిస్ వరల్డ్ నిర్వాహకులు….

మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ ఆరోపణల్లో నిజం లేదని మిస్ వరల్డ్ నిర్వాహకులు వెల్లడించారు. మిస్ వరల్డ్ ఈవెంట్‌పై మ్యాగీ చేసిన విమర్శలను సంస్థ CEO జూలియా మోర్లీ ఖండించారు. హైదరాబాద్‌లో ఉండగా రికార్డ్ చేసిన మ్యాగీ వీడియో స్టేట్మెంట్లు రిలీజ్ చేశారు. “ఫ్యామిలీ ఎమర్జెన్సీ అంటూ మ్యాగీ ఈవెంట్ నుంచి వైదొలిగింది. ఇంగ్లండ్ వెళ్ళాక తనకు ఇబ్బందికరంగా అనిపించడంతో వైదొలిగినట్లు బ్రిటన్ మీడియాకు మ్యాగీ ఇంటర్వ్యూలు ఇచ్చింది.” అని తెలిపారు,..