..భారత్ న్యూస్ హైదరాబాద్….విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని విద్యార్థులను మోసం చేసిన లయోలా కాలేజీ యాజమాన్యం
ఒక్కో విద్యార్థి వద్ద రూ.10 లక్షలు వసూలు చేసి, నకిలీ నియామక పత్రాలు ఇచ్చిన నియామక అధికారి
అల్వాల్ లోని లయోలా కాలేజీ యాజమాన్యం విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిందంటూ కాలేజీ వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థులు

డిగ్రీ పూర్తవ్వకముందే విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని వాట్సప్ లో మెసేజ్ పంపించి, ఒక్కో విద్యార్థి నుండి రూ.10 లక్షలు వసూలు చేసి చివరకు నకిలీ నియామక పత్రాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు
తమను ఎందుకు మోసం చేశారని నిలేదీసేందుకు కళాశాలకు వెళ్తే, తిరిగి తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థులు
వెంటనే తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించిన విద్యార్థులు