భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.భారత్ న్యూస్: హైదరాబాద్:జాగృతి జనంబాట, జోగులాంబ గద్వాల్.
కల్వకుంట్ల కవిత గారి
2029 లో అసెంబ్లీ ఎన్నికల బరిలో కచ్చితంగా ఉంటాం.
ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలోనే ఉంటాం.
ఎంపీగా ఉన్న సమయంలోనూ మన ఊరు-మన ఎంపీ పేరుతో ప్రజల్లోనే ఉన్నా.
మా పార్టీ నాయకులే నన్ను కుట్ర చేసి ఓడించినా ప్రజల మధ్యలోనే ఉన్నా.
నా మనసు విరిగేలా చేశారు. మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్లే ప్రసక్తే లేదు.
గద్వాల్ లో అక్షరాస్యత శాతం చాలా తక్కువ ఉండటం బాధాకరం.
70 ఏళ్లుగా ఒకే కుటుంబాన్ని గెలిపిస్తే వాళ్లు చేసిన అభివృద్ధి ఏంది?
గద్వాల్ లో అక్షరాస్యత పెంచేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
ఇసుక మాఫియా కారణంగా జిల్లాలో రోడ్లు ఆధ్వాన్నంగా మారాయి.
ముఖ్యమంత్రి పేరుతోనే ఇసుక దందా. ఈ దండ ఆయనకు తెలియకుండా జరుగుతుంటే చర్యలు తీసుకోవాలి.
నెట్టెంపాడు, ఆర్డీఎస్ ను పూర్తి స్థాయిలో వాడుకునేలా ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
2029 అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.. ఆ ఎన్నికల్లో మేము పోటీలో ఉంటాం.
ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలోనే ఉండటం మాకు ప్రధానం.
గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా మన ఊరు- మన ఎంపీ అనే కార్యక్రమంతో ప్రజల్లోనే ఉన్నా.
మా పార్టీయే నన్ను కుట్ర చేసి ఓడించినా ప్రజల కోసం పనిచేసిన.
వద్దని చెప్పినా కూడా నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు.
నా మనసు విరిగింది.. ఇక బీఆర్ఎస్ లోకి మళ్లీ వెళ్లేదీ లేదు.
జనం బాటలో భాగంగా 15వ జిల్లాగా గద్వాల్ కు వచ్చాం.
గద్వాల్ అంటేనే వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాంతంగా చెబుతారు.
తుంగభద్ర, కృష్ణానది కలిగిన నడిగడ్డ ప్రాంతంగా ఉన్న జిల్లా ఇది.
అన్ని సంస్కృతులు కలిగిన ఇక్కడ బాష అంటే నాకు చాలా ఇష్టం.
ఇక్కడి మనుషులు ముక్కుసూటిగా ఉంటారు. చాలా మంచి సంస్కృతి కలిగిన నేల.
విధ్వత్తు కలిగిన ప్రాంతం ఇది. ఎంతో మేధా సంపత్తి కలిగిన నాయకులను ఇచ్చిన ప్రాంతం.
సురవరం ప్రతాప్ రెడ్డి, గడియారం రామకృష్ణ శర్మ, బాగా పుల్లారెడ్డి లాంటి వాళ్లు ఈ ప్రాంతం వాళ్లే.
ప్రపంచంలోనే అతి తక్కువ నీళ్లలో ఉండే మహల్స్ ఉంటాయి. నిజాం గారు కట్టిన కొండ కోట ఇక్కడ ఉంటుంది.
తెలంగాణ వచ్చాక దాన్ని మంచి టూరిస్ట్ ప్రాంతంగా ప్రమోట్ చేసుకోవాల్సి చేసుకోలేకపోయాం.
తిరుమలకు పంపించే ఏరువాడ జోరు పంచాలు కూడా మన గద్వాల్ నుంచే వెళ్తాయి.
రాజోలి, గద్వాల్ చేనేత పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
రాజులకు నేసే చేనేత వస్త్రాలను నేసే వారు గనుక రాజోలి అని పేరు వచ్చింది.
ఈ ప్రాంతం పేరు చెప్పగానే ఆడబిడ్డలు ఇష్టపడే పట్టుచీరలు గుర్తుకు వస్తాయి.
మన ప్రాంతంలో అద్భుతమైన కళాకారులు, వనరులు ఉన్నాయి.
గతంలో ఇక్కడ నుంచి వలసలు ఉండేవి. మనకు అప్పు ఇవ్వాలంటే ఇక్కడ వచ్చి మనల్ని కోతుల్ని చూసినట్లు చూసేవారు.
వరల్డ్ బ్యాంక్ ఛైర్మన్ ద్వారా చంద్రబాబు అప్పు తెచ్చాడు. ఆ తెచ్చిన డబ్బు ఏమైందో తెలియని పరిస్థితి.
వరల్డ్ బ్యాంక్ ఛైర్మన్ ఇప్పుడు వచ్చి చూస్తే ఏడ్చే పరిస్థితి ఉంది.
తెలంగాణ వచ్చాక మనం ఇంకా అభివృద్ధి అవుతామని అనుకున్నాం. కానీ అలా జరగలేదు.
దేశ వ్యాప్తంగా అక్షరాస్యత రేటు 80 శాతంగా ఉంటే తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో 76.9 శాతంగా ఉంది.
ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే 69 శాతంగానే ఉంది.
అందులో గతేడాది మహిళల అక్షరాస్యత 65.9 శాతం ఉంటే 2025 నాటికి 61.1 శాతానికి చేరింది.
దేశవ్యాప్తంగా మహిళల ఎడ్యుకేషన్ పెరుగుతుంటే తెలంగాణలో మహిళల ఎడ్యుకేషన్ రోజు రోజుకు తగ్గిపోతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో రైజింగ్ తెలంగాణ అంటూ సంబరాలు ఎలా చేసుకుంటున్నారు.
ఇక గద్వాల్ లో అయితే పురుషులు 49.8 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది.
అందులో మహిళల అక్షరాస్యత 39.4 శాతంగా ఉంది.
కేతిదొడ్డి మండలంలో అయితే 33.77 శాతం అక్షరాస్యత ఉంటే అందులో మహిళలు 23 శాతమే.
ఇక్కడ ఎంపీ అరుణమ్మ ఉన్న బీజేపీ బేటీ పడావో అంటోంది. మరి చదివిస్తున్నారో అర్థమైతలేదు.
ఆవిడ సొంత జిల్లాలో కేతిదొడ్డి మండలంలో మహిళల అక్షరాస్యత 23 శాతం ఉంటే అరుణమ్మ గారు ఏం చేస్తున్నారు?
నన్ను అయితే ఇన్నాళ్లు నిజామాబాద్ లో ఖైదీ చేశారు. ఇక్కడకు కొత్తగా వచ్చాను.
స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఒకటే కుటుంబం కదా ఇక్కడ రాజకీయాన్ని ఏలుతోంది?
అయితే వాళ్ల బావలు, అల్లుళ్లు, బంధువులు వీళ్లే కదా ఉండేది.
గద్వాల్, ఆలంపూర్ లో రోడ్ల పరిస్థితి భయంకరంగా ఉంది.
రోడ్లు బాగాలేకపోవటంతో స్కూల్ బస్సు రాక స్కూల్ కు వెళ్లటం లేదని పిల్లలు చెబుతున్నారు.
ఈ రోడ్ల మీద తిరిగే టిప్పర్లు యాక్సిడెంట్ చేసిన అడిగే వారే లేరు.
మన పర్యటన ఏదో మొక్కుబడిగా కాకుండా ఒక అధ్యయనం లా మేము చేస్తున్నాం.
గద్వాల్ లో అక్షరాస్యత, నీళ్లు, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏమీ లేదు.
ఇక్కడున్న చాలా మంది పిల్లలు గంజాయికి బానిసగా మారారని చెబుతున్నారు.
ఇన్నాళ్లుగా మీ కుటుంబాన్నే గెలిపించటం ప్రజలు చేసిన పాపామా?
ఏ పార్టీ గెలిచినా అందులో ఉండేది మీరే కదా? గద్దెనెక్కిన తర్వాత ఏం చేస్తున్నారు?
కేతిదొడ్డి లో 23 శాతం మహిళల అక్షరాస్యత ఉంటే అరుణమ్మ మీకు ఏమీ అనిపిస్తలేదా?
తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా ఈ విధంగా పరిస్థితి ఉంటుందా?
గతంలో వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చింది మీ గురువు గారే కదా ముఖ్యమంత్రి గారు?
ఉమ్మడి మహబూబ్ నగర్ మీ సొంత జిల్లా. ఇక్కడ అక్షరాస్యత పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
మీరు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవటం కారణంగా కూడా ఆడపిల్లలు చదువుకు దూరమవుతున్నారు.
పదో తరగతి లో పాస్ అయ్యేందుకు మాస్ కాపీయింగ్ చేస్తారంట? ఇదేమైనా బీహారా?
వాళ్లు ఇంటర్ కు వచ్చాక రిజల్టే ఉండదు. మీకు పేరు వచ్చేందుకు రిజల్ట్ చూపించుకుంటారా?
కేరళలో 95 శాతం అక్షరాస్యత ఉంటే మన వద్ద మాత్రం మహిళల అక్షరాస్యత 23 శాతం ఉంది.
ఇక మా పర్యటనలో బీచ్ పల్లి హనుమాన్ గుడికి వెళ్లాం. అక్కడ గోపురం పాడైైపోయింది.
హనుమాన్ టెంపుల్ అభివృద్ది కి కృషి చేయాల్సి ఉంది.
ఆలంపూర్ లో వంద పడకల హాస్పిటల్ ను నాసిరకంగా కట్టారు.
అక్కడకు వెళ్తే ఎలాంటి సౌకర్యాలు లేవు. ప్రభుత్వం కనీసం టేబుళ్లు కూడా ఇస్తలేదు.
ఇక దారిలో వస్తుంటే మక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతులు నెల రోజులుగా ఎదురుచూస్తున్నారు.
మక్కలు కొనటం లేదు. ఈ విషయంపై కలెక్టర్ తో నేనే మాట్లాడాను.
ఇలా ఎక్కడిక్కడ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం.
ఇక తుమ్మిళ్ల ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్లాం. ఆర్డీఎస్ కెపాసిటీని మనం పూర్తిగా వాడుకోవాల్సి ఉంది.
గతంలో కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేశారు. తెలంగాణ వచ్చాక తుమ్మిళ్ల కొంతవరకు పూర్తి చేసుకున్నాం.
కానీ అక్కడ మూడు మోటార్లు ఉంటే ఒక్కటే నడుపుతున్నారు.
పూర్తిగా మూడు మోటార్లను ఆన్ చేయాలంటే కాలువలు పెద్దగా చేయాల్సి ఉంది.
కానీ అందుకు రైతులు ఒప్పుకోవటం లేదు. వారంతా తక్కువ భూమి ఉన్న రైతులే.
ఇక ఈ సమస్య కు పరిష్కారమంటే 40 కిలోమీటర్లు పైప్ లైన్ వేయాల్సి ఉంది.
అప్పుడు మాత్రమే మనం ఆర్డీఎస్ పూర్తిగా కెపాసిటీ వాడుకోగలం.
కృష్ణానదిలో వాటా కోసం మనం ఫైట్ చేస్తుంటాం. ఏ వివాదం లేని ఆర్డీఎస్ నీళ్లను వాడుకోవటంపై ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలి.
గద్వాల్ లో జిల్లాలో ఎక్కడ చూసిన రోడ్లు బాగాలేవు.
ప్రతి ప్రాంతంలో సీఎం బొమ్మ పెట్టుకొని టిప్పర్లతో ఇసుక దందా చేస్తున్నారు.

ఎవరైనా అడిగితే పై నుంచి ఫోన్లు వస్తున్నాయి. దీంతో అధికారులు భయపడుతున్నారు.