USలో ఉంటున్న ఇండియన్స్కు వార్నింగ్

భారత్ న్యూస్ ఢిల్లీ…..USలో ఉంటున్న ఇండియన్స్కు వార్నింగ్

భారత్లోని అమెరికా దౌత్య కార్యాలయం USలో ఉంటున్న భారతీయులను హెచ్చరించింది. ‘వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో ఉండే వారిని డిపోర్ట్ చేస్తాం. అలాగే వాళ్లు తిరిగి అమెరికా వెళ్లకుండా శాశ్వత నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని స్పష్టం చేసింది. ఈ హెచ్చరిక USలో స్టూడెంట్, టూరిస్ట్, వర్క్ పర్మిట్ వీసాలతో ఉంటున్న వారికి వర్తిస్తుంది. వీసా గడువులోపు వాళ్లు భారత్కు వచ్చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు.