అమీన్ పూర్ లో హైడ్రా భారీ ఆపరేషన్.

.భారత్ న్యూస్ హైదరాబాద్….అమీన్ పూర్ లో హైడ్రా భారీ ఆపరేషన్.

భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగింపు.

రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలసి హైడ్రా భారీ ఆపరేషన్.

ఐలాపురం తండాతో పాటు గ్రామంలో ఇళ్ల జోలికి వెళ్లకుండా హైడ్రా చర్యలు.

పేదల యిల్లజోలికి వెళ్లకుండా హైడ్రా ఆపరేషన్.

కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా నిర్మాణాలు జరిపిన Mukheem గెస్ట్ హౌస్ తో పాటు, mukheem సోదరుడు అజీమ్ నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని తొలగించిన హైడ్రా.

తండాలోని నివాసాలతో పాటు ఐలాపురంలో యిళ్ళ జోలికి వెళ్లకుండా ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకుంటున్న హైడ్రా.

సంగారెడ్డి జిల్లా ameenpur మండలం ఐలాపురం విలేజ్ లో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.

ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వచ్చాయి.

ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమినే కాపాడుతున్న ప్రభుత్వం.

863 ఎకరాల భూమి విలువ 15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

యథాతథ స్థితిని కొనసాగించాలని 1998 నుంచి కోర్టు ఆర్డర్లున్నా పట్టించుకోకుండా Mukheem నిర్మించిన గెస్ట్ హౌస్ ను తొలగించిన హైడ్రా.

అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా Mukheem సోదరుడు అజీమ్ నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని తొలగించిన హైడ్రా…