భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…మహిళా సంఘాలకు ఆరోగ్య భరోసా.. ఉచితంగా 30 రకాల పరీక్షలు!
Mar 12, 2026,
మహిళా సంఘాలకు ఆరోగ్య భరోసా.. ఉచితంగా 30 రకాల పరీక్షలు!
తెలంగాణ : రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 8 నుంచి ‘ఉమెన్ వెల్నెస్ ప్రొఫైలింగ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నాన్-కమ్యూనికబుల్ వ్యాధులను ముందుగానే గుర్తించి మెరుగైన వైద్యం అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. సుమారు 46 లక్షల మంది మహిళలకు 30 రకాల ఆరోగ్య పరీక్షలు చేయనున్నారు. ఇందులో రక్తహీనత, మధుమేహం, బీపీ, థైరాయిడ్, కాలేయం, కిడ్నీ పనితీరు వంటివి పరీక్షిస్తారు. తొలి దశలో ప్రతి జిల్లాలోని 5 మండలాల్లో ఈ స్క్రీనింగ్ పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.
