ఇందిరమ్మ ఇళ్లకు భారీగా నిధులు విడుదల!

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఇందిరమ్మ ఇళ్లకు భారీగా నిధులు విడుదల!

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇప్పటివరకు ₹700 కోట్లు జమ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన 3.08 లక్షల ఇళ్లలో, 1.77 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.

ఈ పథకం కింద అందించే ₹5 లక్షల సహాయాన్ని నాలుగు దశల్లో, ఇంటి నిర్మాణ దశను బట్టి, ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.

నిన్న ఒక్కరోజే ₹130 కోట్లను బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు.