చక్కెర కలిగిన పానీయాలకు ‘ORS’ లేబుల్ ఉపయోగించడాన్ని నిషేధించిన FSSAI

…భారత్ న్యూస్ హైదరాబాద్….చక్కెర కలిగిన పానీయాలకు ‘ORS’ లేబుల్ ఉపయోగించడాన్ని నిషేధించిన FSSAI

ఫలించిన హైదరాబాద్ డాక్టర్ శివరంజని 8 ఏళ్ల పోరాటం.

ORS పేరుతో మార్కెట్లో చాలా డ్రింకులు ఉన్నాయి. కానీ అవన్నీ పంచదార కలిపినవి మాత్రమే అని హైదరాబాద్‌కు చెందిన పీడియాట్రిషియన్ డా. శివరంజని సంతోష్ 8 సంవత్సరాలుగా మోసపూరిత ‘ORS’ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) పానీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

ఈ నెల 14న ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) చక్కెర కలిగిన పానీయాలకు ‘ORS’ లేబుల్ ఉపయోగించడాన్ని నిషేధించింది.