భారత్ న్యూస్ మంగళగిరి…గుడ్‌న్యూస్.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు!

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇన్ఫోసిస్ సంయుక్తంగా ‘ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్’ కార్యక్రమాన్ని ప్రారంభించాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో 6-9 తరగతి విద్యార్థుల కు ఉచిత ట్యాబ్‌లు పంపిణీ చేసి, వారిలో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యం. డిజిటల్ పాఠ్యాంశాల తో, విద్యార్థులు తమ అభ్యసనాన్ని మెరుగుపరుచుకుంటారు.
మంగళగిరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. ఇది మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అని తెలిసిందే.
రాష్ట్రంలోని 6 నుంచి 9 తరగతుల విద్యార్థుల కోసం ఎస్సీఈఆర్టీ, సమగ్ర శిక్ష కలిసి ట్యాబ్ కంటెంట్‌ను రూపొందించాయి. గణితం, సైన్స్, ఆంగ్లం, జీవన నైపుణ్యాలు వంటి సబ్జెక్టులను బోధించడానికి ఈ ట్యాబ్‌లను ఉపయోగిస్తారు. ఇన్ఫోసిస్ సంస్థ ప్రత్యేక ప్లాట్‌ఫాం ద్వారా ట్యాబ్‌ల వినియోగాన్ని పర్యవేక్షిస్తూ, నెలవారీ నివేదికలను ప్రభుత్వానికి అందిస్తుంది. ప్రతి విద్యార్థి రోజుకు కనీసం ఒక గంట, ప్రతి పాఠశాల నాలుగు గంటలు ట్యాబ్‌లను వాడేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అంతేకాదు ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలలకు ప్రశంసాపత్రాలు,
