హైదరాబాద్ రోడ్డులోని శ్రీ ప్రసాద్ ఉడిపి హోటల్లో సాంబార్‌లో (జెర్రీ) ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీమతి వి. జ్యోతిర్మయి గారి ఆదేశాల ప్రకారం

భారత్ న్యూస్ డిజిటల్:తెలంగాణ:

నల్గొండ పట్టణం, హైదరాబాద్ రోడ్డులోని శ్రీ ప్రసాద్ ఉడిపి హోటల్లో సాంబార్‌లో (జెర్రీ) ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీమతి వి. జ్యోతిర్మయి గారి ఆదేశాల ప్రకారం, ఈరోజు నల్గొండ జిల్లాలో సదరు ఫిర్యాదుపై తక్షణ తనిఖీ ., చర్యల నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించడం జరిగింది.

వారి ఆదేశాల మేరకు, నల్గొండ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO) హోటల్‌ను తనిఖీ చేయగా, కింది లోపాలు గుర్తించబడ్డాయి:

ఫుడ్ లైసెన్స్ ప్రదర్శించకపోవడం.

ఆహారం నిర్వహించే సిబ్బంది ప్రాథమిక పరిశుభ్రత నిబంధనలు పాటించకపోవడం.

ఆహార పదార్థాలను నేలపై నేరుగా నిల్వ చేయడం.

రవ్వ మరియు పిండి వంటి ఆహార పదార్థాలలో అనవసర పదార్థాలు ఉండటం మరియు పురుగులు పట్టి ఉండటం.

స్టోర్‌రూమ్ బయటకు నేరుగా తెరిచి ఉండటం, రక్షణ జాలం లేకపోవడం వల్ల ఎలుకలు, పురుగులు, దుమ్ము మరియు తేమ లోనికి ప్రవేశించే అవకాశం ఉండటం.

కూరగాయలను పరిశుభ్రత లేని పరిస్థితుల్లో బయట నిల్వ చేయడం వల్ల ఈగలు, పురుగులు మరియు దుమ్ముకు గురికావడం.

వంటగది మరియు స్టోర్‌రూమ్‌లలో పొగ మచ్చలు, దుమ్ము మరియు నూనె మరకలు ఉండటం.

అనుమతించిన పరిమితులను మించి వంట నూనెను పునర్వినియోగం చేయడం మరియు RUCO మార్గదర్శకాలకు అనుగుణంగా ఎలాంటి రికార్డులు నిర్వహించకపోవడం.

కీటక నియంత్రణ, ఫుడ్ హ్యాండ్లర్స్ శిక్షణ, డీప్ క్లీనింగ్ మరియు స్టోర్ రిజిస్టర్లకు సంబంధించిన రికార్డులు లేకపోవడం.

తీసుకున్న చర్యలు:

నోటీసు ( Notice) జారీ చేయడం జరిగింది.

పురుగులు పట్టిన 6 కిలోల ఉప్మా రవ్వ మరియు 3 లీటర్ల వాడిన వంట నూనెను ధ్వంసం చేయడం జరిగింది.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం రెండు నమూనాలు పరీక్షల కోసం సేకరించబడినవి.

సురక్షిత ఆహార నిర్వహణ మరియు నిల్వ విధానాలపై సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగింది.

హోటల్ సిబ్బందికి ఆహార పదార్థాల సరైన నిల్వ విధానాలు, పరిశుభ్రత పాటించాల్సిన నిబంధనలు మరియు ఆహార కలుషితాన్ని నివారించే చర్యలపై అవగాహన కల్పించడం జరిగింది. నాణ్యత లోపాలు ఉన్న, వినియోగానికి అనర్హమైన ఆహార పదార్థాలను అక్కడికక్కడే గుర్తించి నిబంధనల ప్రకారం ధ్వంసం చేయడం జరిగింది.
సేకరించిన ఆహార నమూనాల ప్రయోగశాల నివేదికలు ఆధారంగా ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం ప్రకారం తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టబడతాయని శ్రీమతి వి. జ్యోతిర్మయి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఉమ్మడి నల్గొండ జిల్లా తెలిపారు.

ఈ రకమైన ఉల్లంఘనలకు పాల్పడి నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ సదరు వ్యాపారులను హెచ్చరించారు.