తెప్పోత్సవం రద్దు,

భారత్ న్యూస్ రాజమండ్రి…తెప్పోత్సవం రద్దు

విజయవాడ దుర్గాదేవి నవరాత్రుల్లో భాగంగా దసరా రోజు నిర్వహించే తెప్పోత్సవం ఈ ఏడాది కూడా రద్దైంది.

కృష్ణా నదికి భారీగా వరద వస్తుండటంతో అమ్మవారి తెప్పోత్సవం నిర్వహణకు నీటి పారుదలశాఖ అనుమతి ఇవ్వలేదు.

ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

2022,2023లోనూ దశమి రోజు వర్షం కురవడంతో తెప్పోత్సవం రద్దైంది.

మరోవైపు ఇవాళ TTD నుంచి అమ్మవారికి సారెను సమర్పించారు.