వైద్యాధికారుల పనితీరు మెరుగుపరచాలి: కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

భారత్ న్యూస్ ఖమ్మం…..వైద్యాధికారుల పనితీరు మెరుగుపరచాలి: కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది తమ పనితీరును మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు.
శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రుల్లో సమయపాలన కచ్చితంగా పాటించాలని, బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని సూచించారు. విధులకు గైర్హాజరు అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, రోగులు ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు.
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు….