భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….పిల్లల ఆధార్ అప్‌డేట్: శుభవార్త!
5 నుంచి 17 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేషన్ సేవను ఒక ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ప్రకటించింది.
ఈ ఉచిత సేవ ద్వారా 6 కోట్ల మందికి పైగా పిల్లలకు ప్రయోజనం కలుగుతుంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం 5 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు సమయంలో వేలిముద్రలు (Fingerprints), కనుపాపల గుర్తులు (Irisతీసుకోరు.
అందువల్ల, వీరు 5 ఏళ్లు నిండిన తర్వాత ఒకసారి మరియు 15 ఏళ్లకు చేరుకున్న తర్వాత మరోసారి తప్పనిసరిగా బయోమెట్రిక్స్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
✰ ఏడాదిపాటు ఉచిత సేవలు పూర్తయిన తర్వాత అప్‌డేట్ చేయించుకోవడానికి రూ.125 వసూలు చేస్తారు.
✰ బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేసుకోవడం ద్వారా కింది ముఖ్య ప్రయోజనాలు ఉంటాయి:
పాఠశాలల ప్రవేశాలు (School Admissions) సులభతరం అవుతాయి.
ప్రవేశపరీక్షల రిజిస్ట్రేషన్ మరియు స్కాలర్‌షిప్ ప్రయోజనాలు.
వివిధ పథకాల ద్వారా అందే డీబీటీలు (Direct Benefit Transfers) పొందడానికి వీలవుతుంది.
✰ అందువల్ల, తల్లిదండ్రులు వెంటనే ఈ వయసు పిల్లల బయోమెట్రిక్స్ అప్‌డేషన్ చేయించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.
