హైదరాబాద్‌లో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్

.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్

హైదరాబాద్ నగరంలో చికెన్ షాప్ యజమానులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి బంద్‌కు పిలుపునిచ్చారు. పౌల్ట్రీ కంపెనీలు సరైన మార్జిన్ ఇవ్వకపోవడంతో వ్యాపారులు నష్టపోతున్నట్లు తెలిపారు.

తగ్గించిన మార్జిన్‌కు వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిసాయి. వ్యాపారులు దీనిపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

మార్జిన్‌ను వెంటనే సరిచేయాలని, అప్పటి వరకు బంద్ కొనసాగుతుందని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది.