ఇందిరమ్మ ఇండ్ల కాల్ సెంటర్‌కు భారీ స్పందన: 25 రోజుల్లో 15 వేల కాల్స్

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఇందిరమ్మ ఇండ్ల కాల్ సెంటర్‌కు భారీ స్పందన: 25 రోజుల్లో 15 వేల కాల్స్

ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు అనూహ్య స్పందన వస్తున్నది.

సోమవారం వరకు 25 రోజుల్లో 15 వేల కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఇందులో ఆధార్ అప్‌డేట్ సమస్యలపై 1500, బ్యాంకుల్లో ప్రభుత్వ సాయం ఆలస్యంపై వెయ్యి, జియో ట్యాగింగ్ సమస్యలపై 600, హౌసింగ్ ఈఈల వద్ద పెండింగ్ అంశాలపై వెయ్యి కాల్స్, ఇందిరమ్మ ఇంటి కోసం 3,500 మంది ఫోన్లు చేశారు.