…భారత్ న్యూస్ హైదరాబాద్….గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు
Dec 08, 2025,
గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు
ఆర్బీఐ రెపో రేటును 0.25% మేర తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను 0.25% సవరించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెపో అనుసంధానిత రుణ రేటును 8.35 నుంచి 8.10% తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హోమ్ లోన్ రేట్లు 7.10%, కారు లోన్ రేట్లు 7.45% నుంచి ప్రారంభం అవుతాయని తెలిపింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 8.15 నుంచి 7.19%కి, బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.35 నుంచి 8.10%కి సవరించాయి.
