భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…: ముందస్తు బుకింగ్ పేరుతో బురిడీ
నిందితుడి అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు
హన్మకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్
బాలాజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఆఫీసు మాదాపూర్ లో జూబ్లీ ఎంక్లేవ్ ఏరియాలో కలదు
దీనిని నిందితుడు అయిన సోలిపేట ప్రభాకర్ రెడ్డి 2018లో 68% వాటాతో కొనుగోలు చేయడం జరిగినది ఇతనితో పాటు 32% వాటా తో కోడూరు లక్ష్మీ ఆమె ఇతనితో పాటు పార్ట్నర్షిప్ కలదు.గుండ్ల పోచంపల్లి ఏరియాలో SVB VAIBHAV ప్రాజెక్టు పేరుతో సెవెన్ ఫ్లోర్స్ లో మొత్తం 164 అపార్ట్మెంట్లు కడుతున్నామని, దానికి ముందుగా బుక్ చేసుకుంటే తక్కువ ధరకు ఇస్తామని మోసపు మాటలు చెప్పి బాధితులు దగ్గర నుండి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడుతున్నారు
ఇదే క్రమంలో హనుమకొండ ఏనుగుల గడ్డకు చెందిన బాధితురాలు అయిన బందెల్లి స్వర్ణ దగ్గర ముందస్తు బుకింగ్ పేరుతో తక్కువ ధరకు ఇస్తామని మాయమాటలు చెప్పి నమ్మబలికి రెండు అపార్ట్మెంట్లు తీసుకొనుటకు బుకింగ్ చేసుకుని ఆమె వద్ద నుండి సుమారు 81 లక్షలు రూపాయలు డబ్బులు తీసుకొని ఇప్పటివరకు ఎటువంటి వర్క్ మొదలు పెట్టకుండా మోసం చేసినారు
ఈరోజు బాలాజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్ సొలిపేట ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగినదని ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు
