శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్న విక్కుర్తి.

భారత్ న్యూస్ రాజమండ్రి….శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్న విక్కుర్తి.

కోడూరు మండలంలోని జరుగువానిపాలెం గ్రామంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు పాల్గొన్నారు.

జరుగువానిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో జూన్ రెండవ తేదీ సోమవారం ఉదయం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి.

ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలలో నిర్వాహకులతో కలిసి విక్కుర్తి పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు విక్కుర్తి శ్రీనివాస్ ను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమాలలో విక్కుర్తి రాంబాబు, న్యాయవాది విక్కుర్తి రామకృష్ణ, జరుగు శేషగిరి, జరుగు ఆంజనేయులు, దాసరి పవన్, జరుగు నాగబాబు, జరుగు జనార్ధనరావు, జరుగు శ్రీనివాస్, జరుగు నరసింహారావు, జరుగు నాంచారయ్య, అప్పికట్ల మహేష్, జరుగు సాంబశివరావు, దాసరి మణికంఠ, అప్పికట్ల వెంకటేశ్వరరావు, జరుగు గోపి, జరుగు బాపనయ్య, జరుగు నాగేంద్రం, సింగంశెట్టి రాధా లతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

జయపురంలోని శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకున్న విక్కుర్తి.

కోడూరు మండలంలోని జయపురం గ్రామంలో ప్రధాన రహదారి ప్రక్కనగల శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారిని స్థానిక నేతలతో కలిసి విక్కుర్తి శ్రీనివాస్ దర్శించుకుని, ప్రత్యేక పూజలునిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు శ్రీనివాస్ ను దుశాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రముఖులు గోగినేని సోమశేఖర్, వేమూరి ప్రభాకరరావు, రాము, కనకమేడల రామబ్రహ్మం, సజ్జా రవీంద్ర, సూర్యదేవర, మండవ వెంకటేశ్వరరావు, సబ్బినేని ప్రసాద్, గద్దె రమేష్, గొర్రెపాటి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.