భారత్ న్యూస్ గుంటూరు…పురాతన సందేశ వాహక వ్యవస్థను ఒడిశా పోలీసులు నేటికీ వారసత్వ సంపదగా కాపాడుతున్నారు. 2008లో ఈ సేవలు అధికారికంగా ముగిసినా.. గణతంత్ర దినోత్సవం వంటి వేడుకల్లో వీటిని ఉపయోగిస్తున్నారు. 1948లో ప్రధాని నెహ్రూ పంపిన అత్యవసర సందేశాన్ని ఒక పావురం 265 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5.20 గంటల్లో చేరవేసి రికార్డు సృష్టించింది. ఈ అరుదైన సంప్రదాయాన్ని ఒడిశా ప్రభుత్వం ఇప్పటికీ గౌరవిస్తోంది.
