12 లక్షల లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు

…భారత్ న్యూస్ హైదరాబాద్….రూ.12 లక్షల లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో ఒక వ్యక్తి ఆదిబట్లలో ఉన్న తన 7 గుంటల భూమిని నిషేధిత జాబితా నుండి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని విజ్ఞప్తి చేయగా, రూ.12 లక్షలు లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కృష్ణ

రూ.9 లక్షలకు ఒప్పందం కుదుర్చుకోగా, వెంటనే రూ.4 లక్షలు చెల్లించాలని, లేకపోతే పని జరగదని డిమాండ్ చేసిన ఆర్ఐ కృష్ణ

దీంతో నిస్సహాయ స్థితిలో ఏసీబీని ఆశ్రయించగా, విచారణ జరిపి పక్కా ఆధారాలతో ఆర్ఐ కృష్ణను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు