తెలంగాణలోని ప్రతి మండలానికి 4 నుంచి 6 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమిస్తున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌:

తెలంగాణలోని ప్రతి మండలానికి 4 నుంచి 6 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమిస్తున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

సచివాలయంలో శుక్రవారం రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 27న శిక్షణ పొందిన లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు తుది పరీక్ష నిర్వహిస్తామని..

ఆ తర్వాత 28, 29 తేదీల్లో జేఎన్టీయూ ఆధ్వర్యంలో ల్యాబ్‌ ప్రాక్టికల్స్‌ పరీక్ష నిర్వహిస్తామన్నారు.

ఆగస్టు 12న ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు సర్వేయర్లతోపాటు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవోను నియమించనున్నట్లు తెలిపారు.

నక్షా లేని 413 గ్రామాలు రాష్ట్రంలోఉన్నాయన్నారు. నక్షా కోసం 5 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా రీసర్వే చేశామని, వీటి ఫలితాలను పరిగణనలోకి తీసుకుని మిగిలిన గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.