భారత్ న్యూస్ ఢిల్లీ…..వృద్ధాప్య తల్లితండ్రులను పట్టించుకోకపోతే.. ఆస్తి అనుభవించే హక్కు లేదు: సుప్రీంకోర్టు
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు వారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అలా ప్రవర్తించే సంతానాన్ని బయటకు వెళ్లగొట్టొచ్చని తేల్చిచెప్పింది. బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం అండగా నిలుస్తుందని వ్యాఖ్యానించింది.కుమారుడు తమ సంరక్షణ బాధ్యతలు చూసుకోవడం లేదంటూ మహారాష్ట్రకు చెందిన 80 ఏళ్ల వృద్ధ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ తీర్పు వెలువడింది. తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రైబ్యునళ్లు కన్నవారిని పట్టించుకోని బిడ్డల విషయంలో సత్వర విచారణ జరుపుతాయని తెలిపింది. ఇలాంటి వివాదాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు బదిలీ చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి బాధితులకే దక్కేలా ఆదేశించే అధికారం ఆ ట్రైబ్యునళ్లకు ఉంటుందని ధర్మాసనం స్పష్టంచేసింది.
