భారత్ న్యూస్ ఢిల్లీ…..అక్టోబర్ 16న శబరిమలకు ద్రౌపది ముర్ము
అక్టోబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించనున్నారని కేరళ దేవస్వామ్ మంత్రి వీఎన్ వాసవన్ ప్రకటించారు. అక్టోబరు 16వ తేదీన ప్రారంభమయ్యే ‘తులం’ పూజల చివరి రోజున ఆమె పర్యటించనున్నారు. మే నెలలో భారత్-పాకిస్థాన్ సరిహద్దు వివాదం కారణంగా రద్దైన పర్యటన ఇప్పుడు జరగనుంది. గ్లోబల్ అయ్యప్ప సంగమం సిఫార్సుల అమలుకు 18 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
