నేడు భారత్‌కు పుతిన్‌ ప్రధాని నివాసంలో విందు,,

భారత్ న్యూస్ ఢిల్లీ…..నేడు భారత్‌కు పుతిన్‌ ప్రధాని నివాసంలో విందు

🇷🇺 రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గురువారం భారత్‌కు చేరుకోనున్నారు.

పర్యటన సందర్భంగా వాణిజ్య, ఆరోగ్య, వ్యవసాయ, మీడియా, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాలలో ఉభయ దేశాల మధ్య ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉంది.

భారత్‌-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం 25వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య 23వ ద్వైపాక్షిక సదస్సు జరగనుండడం విశేషం.