ఖాళీ అవ్వబోయే 8 రాజ్యసభ స్థానాలకు జూన్ 19న పోలింగ్

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఖాళీ అవ్వబోయే 8 రాజ్యసభ స్థానాలకు జూన్ 19న పోలింగ్

వచ్చే రెండు నెలల్లో ఖాళీ అవుతున్న 8 రాజ్యసభ స్థానాలకు జూన్ 19న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం
ప్రకటించింది.

అస్సాం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు పదవీకాలం జూన్ 14న ముగియనుంది.

తమిళనాడులో 6 రాజ్యసభ స్థానాలకు పదవీకాలం జులై 24తో
ముగిసిపోనుంది.

ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఈసీ జూన్ 2న ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం వెలువరించనుంది. నామినేషన్లకు చివరి తేదీ జూన్ 9.