ఆప‌రేష‌న్ సింధూర్‌.. భ‌విష్య‌త్తు యుద్ధాల గురించి సైనిక ద‌ళాల స్ట‌డీ

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఆప‌రేష‌న్ సింధూర్‌.. భ‌విష్య‌త్తు యుద్ధాల గురించి సైనిక ద‌ళాల స్ట‌డీ

🇮🇳 ఆప‌రేష‌న్ సింధూర్(Operation Sindoor) యుద్ధ నీతిలో కొత్త పంథాకు తెర‌లేపింది. టెక్నాల‌జీ ఆధారంగా యుద్ధం ఎలా చేయాల‌న్న అనేక విష‌యాల‌ను ఆ ఆప‌రేష‌న్‌లో తెలుసుకున్నారు. అయితే భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌బోయే యుద్ధాల‌ను ఎదుర్కొనేందుకు త్రివిధ ద‌ళాల‌కు చెందిన బ‌ల‌గాలు ఇప్పుడు త‌మ ఆధునిక నైపుణ్యాన్ని పెంచుకునే ప‌నిలో ప‌డ్డాయి.

🔥 దీనిలో భాగంగానే ఢిల్లీలోని మానెక్‌షా కేంద్రంలో యుద్ధ కోర్సును ప్రారంభించాయి. యుద్ధ టెక్నాల‌జీలో వ‌స్తున్న మార్పులు, దానికి అనుగుణంగా ఎలా ప‌టిష్టంగా త‌యారు కావాల‌న్న ల‌క్ష్యంతో త్రివిధ ద‌ళాలు శిక్ష‌ణ మొద‌లుపెట్టాయి.

🔥 సుమారు మూడు వారాల పాటు ఆ శిక్ష‌ణా కోర్సు జ‌ర‌గ‌నున్న‌ది. యుద్ధాల్లో టెక్నాలజీ ప్ర‌భావం, మూడు ద‌ళాల మ‌ధ్య స‌మన్వ‌యం ఎలా కుదుర్చుకోవాలి, స్వ‌దేశీ ఆయుధాల ఉత్ప‌త్తి లాంటి అంశాల‌పై ఈ స్ట‌డీ జ‌ర‌గ‌నున్న‌ది.