భారత్ న్యూస్ ఢిల్లీ…..ఆ వాహనాలకు పన్ను చెల్లించక్కర్లేదు: సుప్రీంకోర్టు
📍ఏపీ మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ చట్టం-1963 కింద మోటారు వాహనాల పన్నుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
పబ్లిక్ రహదారుల్లో వాహనం నడపకుండా..
ప్రైవేట్ స్థలాలకు పరిమితమైతే సదరు వాహనాలకు పన్ను చెల్లించనక్కర్లేదని పేర్కొంది.
ఏపీలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది.
ఇప్పటి వరకు కట్టిన రూ. 22,71,700 పన్నును ఆ సంస్థకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది
